Tuesday, December 20, 2011

raama kadhanu vinarayya


సంగీత పరంగా విజయం పొందిన చిత్రాలలో లవకుశ చిత్రానికి అగ్రస్థానం ఇవ్వొచ్చు.ఘంటసాల సంగీత జీవితంలో లవ కుస ఒక మయిలు రాయి.సంగీత దర్శకునిగా తన విరాట్ స్వరూపాన్ని అయన ఈ చిత్రంలో ప్రదర్శించారు.ఈ చిత్రంలో ఆయన సందర్భోచితంగా శాస్త్రీయ సంప్రదాయ రాగాలని ఉపయోగిస్తూ సమకూర్చిన బాణీలు ఈ నాటికీ శ్రోతల్ని అలరిస్తూ ప్రసంసలు పొందుతున్నాయి.
   హిందోళ రాగం లో సుశీల ,లీల చేసిన   ఈ రామ కధాగానం  అత్యంత రమణీయం
           


Wednesday, November 23, 2011

లవకుశ పాత చింతకాయ పచ్చడా ?

నందమూరి నటించిన `లవకుశ' చిత్రాన్ని పాత చింతకాయ పచ్చడి' గా ఎస్ .ఫై.బాలు గారు అభివర్ణించడం ఒక విధంగా ఆయన మనసులో ఘంటసాల పట్ల ఉన్న ఈర్ష్య కి నిదర్సనం గా చెప్పవొచ్చు.ఇటీవల ABN ANDHRAJYOTHI T.V లో `రామ రాజ్యం 'చిత్రం గురించి మాట్లాడుతూ ,లవకుసచిత్రం పాత చిన్తాకాయ పచ్చడి ,ఆ చిత్రాని ఎంతకన్నిచుస్త్తం అనుకుంటున్నా యువతరం కోసం రామ రాజ్యం చిత్రం తీసారనడం దురదృష్టకరం.
ఒక సెలబ్త్రేటి మీడియా లో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడాలి .
అందులోనూ `తెలుగు చిత్రాలల్లో ఒక క్లాసిక్ చిత్రంగా చరిత్రలో నిలచిపోయిన లవకుశ చిత్రం గురించి మాట్లాడేటప్పుడు చాలా balanced గా మాట్లాడాలి .
బాలు గారికి రామ రాజ్యం చిత్రనిర్మాత పట్ల అపారమైన gauravam, ,ప్రేమ ఉన్నాయనడానికి ఆయన `నేను ఆయన పాదాలకి నమస్కారం చేస్తాను 'అనడమే నిదర్సనం.
రామరాజ్యం చిత్రం తీయడం నిజంగానే ఒక మంచి ప్రయత్నం.అభినందిచాదగ్గ ప్రయత్నం.
అయితే లవకుశ గురించి ప్రస్తావించకుండా బాలు గారు మాట్లాడితే సంతోషించే వాలం.
లవకుశ సంగీత పరంగా ఒక`master piece'. సంగీత దర్శకుడిగా ఘంటసాల ఈ చిత్రంలో ఆయన విస్వరుపాన్ని చూపించారు. .. చిత్రం టైటిల్స్ నుండి శుభం కార్డ్ వరకు లవకుశ చిత్రంలో వినిపించే సంగీతం ఒక musical feast .
ఆ పాటలు ఈనాటికి ఇంటింటా వినిపిస్తున్నాయి.
ఇలయ రాజ గొప్ప సంగీత దర్శకుడే కావచ్చు కాని లవకుశ చితం తో పోలిస్తే రామరాజ్యం సంగీత పరంగా లవకుశ స్థాయి కి ఎప్పటికి చేరుకోలేదు.
బాపు గారు ఒక సందర్మ్భం లో నాతో మాట్లాడుతూ `నాకు సంగీతం గురించి అంత తెలియదండి' అని చాల నిజాయితీగా ఒప్పుకున్నారు.ఈవిషయం సంగీత ప్రదానంసంగా ఉన్న `త్యాగరాజు' చిత్రంలోనే రుజువైంది.త్యాగరాజు చిత్రం సంగీత పరంగా ఫెయిల్ అవడం మనకి తెలిసిందే.
లవకుశ చిత్రంలో ఘంటసాల సంగీతంలో చాలా వైవిద్యం చూపించారు.అందులో చాలా విధాలైన సంగీత ప్రక్రియలున్నాయి.చాలా రాగాలు వినియొగిస్తూ స్వరకల్పన చేసారు.
రామరాజ్యం సంగీత పరంగా ఎటువంటి విశిష్టత నీ సంతరించుకోలేదు .
ఒక గాయకుడై బాలు లవకుశ చిత్రాన్ని పాత చింతకాయపచ్చడి గా అభివర్ణించడం ఎంతవరకు సమంజసమో మీ అభిప్రాయాన్ని తెలియజేయమని కొరుతూ
మీ మురళి మోహన్